ఏపీలోకి ప్రశాంత్ కిషోర్ టీం!

0

ప్రశాంత్ కిషోర్… అలియాస్ పీకేం టీం మళ్లీ ఏపీకి వస్తోంది. ఎన్నికలు లేవు కదా ఇప్పుడేం పని ఆలోచించకండి.. జగన్ గెలుపులో తనదైన పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేసే పథకాల పర్యవేక్షణ బాధ్యతను కూడా చేపట్టబోతోంది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచింది. లాండ్ స్లైడ్ విక్టరీ సొంతమైంది. ఈ అఖండ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని దేశమంతా చెప్పుకుంటున్నారు. అది వాస్తవం కాకున్నా అతడికి మాత్రం మైలేజ్ వచ్చింది. వాస్తవానికి చంద్రబాబు మీద వీపరీతంగా ఉన్న వ్యతిరేకత కారణంగా జగన్ ఏకపక్ష విజయం సాధ్యమైంది. దాంతోపాటు జగన్ ను సీఎంగా చూడాలి అని ప్రజలు అందరూ ఓటు వేసి ఒక్క చాన్సంటూ వచ్చిన జగన్ కు పట్టం కట్టారు.

అయితే జగన్ పాదయాత్ర సహా పార్టీ కోసం పాటుపడ్డ కష్టం కాస్తా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో వేసుకొని తమిళనాడులో డీఎంకే కాంట్రాక్టును కొట్టేశాడు. అయితే ఇప్పుడు ఏపీలో విజయానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ టీంను మరో పనికి కూడా సీఎం జగన్ ఉపయోగించుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఏపీలో పారదర్శక పాలన అందించడానికి సీఎం జగన్ సంకల్పించారు. సచివాలయం వార్డు వలంటీర్ల జాబులను దాదాపు 5 లక్షలు ఇచ్చాడు. ప్రతీ 50 ఇండ్లకు ఒక వలంటీర్ ను పెట్టి అన్ని డోర్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో జాబ్స్ ఇచ్చాడు. కానీ క్షేత్రస్థాయిలో వలంటీర్స్ సరిగా చేయడం లేదు అని రిపోర్టులు వచ్చాయట.. దీంతో వారిని సరిగా పర్యవేక్షించేందుకు వలంటీర్ల వ్యవస్థ మీద సూపర్ వైస్ చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ తీసుకుంటున్నారని.. అతడికే పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్ప బోతున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.
Please Read Disclaimer