Templates by BIGtheme NET
Home >> Telugu News >> Marriage : ముందు సహజీవనం.. పిల్లలు పుడితేనే పెళ్లి

Marriage : ముందు సహజీవనం.. పిల్లలు పుడితేనే పెళ్లి


భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప ప్రాముఖ్యత ఉంది. భారత్ లోని వివాహ వ్యవస్థకు.. పెళ్లిళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. యువతి మెడలో యువకుడు తాళి కట్టిన తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది. మెట్రో సిటీల్లో సహజీవనం సాగించే జంటలున్నా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు.

మనదేశంలో చూస్తే పెళ్లి తంతు ముగిసిన తర్వాతే సంసారం పిల్లలు అనే సంస్కృతి ఉంది. అయితే పాశ్చాత్య సంస్కృతిని పోలేలా మనదేశంలోని ఓ ప్రాంతంలో పెళ్లి తంతు జరుగుతుంది. ఇది అచ్చం సహజీవనంతోనే మొదలవుతుంది.

ముందు యువతీ యువకులు సహజీవనం చేస్తారు. పిల్లలు పుడితేనే పెళ్లి చేసుకుంటారు. లేదంటే వాళ్ల బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులకు వివాహం చేస్తారు. ఈ ప్రేమలు సహజీవనం పెళ్లిళ్ల తంతు రాజస్థాన్ లో జరుగుతుంది.

రాజస్థాన్ లోని గరాసియా తెగలో ఇలాంటివేమీ కనిపించవు. ఈ ఆదివాసీ తెగలో నచ్చిన యువతీ యువకులు ముందుగా సహజీవనం చేస్తారు. సంతానం కలిగిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పాలి జిల్లాల్లో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ గరాసియా తెగ ఉంది.

ఈ గరాసియా తెగ ఆచారం పూర్తి భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లో రెండు రోజుల పాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లి చూపుల వేదికగా పరిగణిస్తారు. జాతరలో కలుసుకునే యువతీ యువకులు తమకు నచ్చిన వాళ్లను ఎంచుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడితే లేచిపోతారు. తిరిగి వచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలుపెడుతారు. పిల్లలు పుట్టిన తర్వాత తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు. లేదంటే కొందరు పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం సహజీవనం చేస్తారు.

కొందరైతే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేస్తారు. కొంత మంది పిల్లలు తల్లిదండ్రుల వివాహం ఒకేసారి జరిగిన సందర్బాలున్నాయి. 50 60 ఏళ్ల వయసు వారు కూడా షష్టి పూర్తి వేళ పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.

ఒకవేళ సంతానం కలుగకపోతే యువతీ యువకులు విడిపోతారు. మళ్లీ స్వయంవరం మొదలవుతుంది. నచ్చినవాళ్లతో రెండోసారి సహజీవనం సాగిస్తారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాలనుకుంటే విడిపోయి వేర్వేరుగా నివసిస్తారు. ఇక వరుడి కుటుంబం.. పెళ్లి ఖర్చులు భరించాలి.. వదువు కుటుంబానికి కన్యాశూల్యం కూడా ఇచ్చే సంప్రదాయం ఈ తెగలో ఉంది.

పాశ్చాత్య దేశాల్లో సహజీవనం పేరిట సాగించే ఈ సంస్కృతి భారత్ లోని గరాసియా తెగలో కనిపిస్తుండడం విశేషం. ఇదేమీ కొత్తగా మొదలైన సంప్రదాయం కాదు.. గత 1000 సంవత్సరాల నుంచి వస్తున్న వారి ఆచారం కావడం విశేషం.