బ్రిటన్ రాజుకి వైరస్ అంటించిన సింగర్?

0

కరోనా సామాజిక జీవి. దానికి తర – తమ బేధాలు లేవు. దోమ లాగే అది అందరికీ సోకుతుంది.. కుడుతుంది.. బ్రిటన్ రాజును కూడా వదల్లేదు. తాజాగా కరోనా వైరస్ బ్రిటన్ రాజు చార్లెస్ కు సోకింది. ఆయనకు పాజిటివ్ అని తెలియడంతో ప్రపంచమే నివ్వెరపోయింది.

అయితే ఇక్కడే ఒక విషయం వెలుగుచూసింది. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్ ను ప్రముఖ సింగర్ కనిక కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో ప్రిన్స్ చార్లెస్ తో కనిక మాట్లాడింది. ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ ఫొటోలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనిక.. లండన్ నుంచి భారత్ కు వచ్చాక ఆమెకు కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. అయితే ఆమెకు కరోనా నిర్ధారణ కాకముందే పలువురు రాజకీయ నాయకులతో ప్రముఖులతో పార్టీలకు హాజరైంది. ప్రిన్స్ చార్లెస్ తో లండన్ లో ఓ కార్యక్రమంలోనూ పాల్గొంది. కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కరోనాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కనికా ఇలా కరోనా ఉన్న పార్టీలకు హాజరు కావడంపై సోషల్ మీడియాలో ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. కనిక ప్రిన్స్ చార్లెస్ కు కరోనా అంటించిందా లేదా.. ప్రిన్స్ చార్లెస్ ఏకంగా కరోనాకు కరోనా అంటించాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరు ఎవరికి అంటించారో లేక ఆ ఫొటో పాతదో కొత్తదో కానీ.. వైరల్ అయిపోయింది.

తాజాగా ఐసోలేషన్ లో ఉన్న కనికాకు మూడో సారి నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-