సెక్స్ రాకెట్ నడుపుతున్న ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్

0

తాజాగా ఒక సెక్స్ రాకెట్ బద్ధలైంది. దీని వెనుక బాలీవుడ్ కు చెందిన ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్న విషయాన్ని గుర్తించారు. తాజాగా ముంబయి పోలీసులు బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ లాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉజ్బెకిస్థాన్ కు చెందిన మహిళల్ని భారత్ కు తీసుకొచ్చి.. వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న విషయాన్ని ముంబయి పోలీసులు గుర్తించారు.

తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఆ ఇద్దరు మహిళల్ని పోలీసులు రక్షించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలోని ఫోర్ స్టార్ హోటల్ లో ఈ దందాను గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే..డిసెంబరు 23న కూడా ఇదే హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల వ్యవధిలో మరో సెక్స్ రాకెట్ బద్ధలు కావటం సంచలనంగా మారింది.

విదేశీ మహిళల్ని ఏరగా వేసి ఒక్కో కస్టమర్ నుంచి రూ.80వేల వరకూ వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ సాయంతో ఉజ్బెకిస్థాన్ కు చెందిన జరీనా అనే మహిళ ఈ సెక్స్ రాకెట్ ను నడుపుతున్నట్లుగా గుర్తించారు. తాజాగా రాజేశ్ కుమార్ మీద హ్యుమన్ ట్రాఫికింగ్ కింద పలు కేసుల్ని నమోదు చేశారు. ఈ ఉదంతం తాజాగా బాలీవుడ్ లో సంచలనంగా మారింది.
Please Read Disclaimer