ఇందుకే కదా అందరూ నీకు ఫిదా అయ్యేది

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మరెవ్వరికి లేదు. అన్ని కులాలు మతాలకు అతీతంగా పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యూత్ అయితే పవన్ అంటే పడి చచ్చిపోతారు. దీనికంతటికి కారణం పవన్ సింప్లిసిటీయే. ఒక స్టార్ హీరోలా పవన్ అస్సలు బిహేవ్ చేయడు. సినిమాల్లో ఉన్నా అలాగే ఉన్నాడు.ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కూడా అలాగే ఉన్నాడు.

పవన్ కల్యాణ్ రీసెంట్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాకు షేక్ చేస్తున్నాయి. గోదావరి పర్యటన ముగించుకున్న తర్వాత పవన్.. ఒక చోట రెస్ట్ తీసుకున్నాడు. అలాగని అది ఫైవ్ స్టార్ హాటోల్ కాదు. తాను ప్రయాణించే కారే. ఆ కారులో వెనుక సీట్లును పక్కకు నెట్టి అక్కడే టీ తాగుతూ విశ్రాంతి తీసుకున్నాడు. గోదావరి జిల్లాలో పామాయిల్ తోటలు ఎక్కువ. ఇప్పుడు పవన్ రెస్ట్ తీసుకుంటున్న పొలం కూడా పామాయిల్ తోటే. కారులో రెస్ట్ తీసుకోవడానికి రెడీగా దిండు కూడా ఉంది. ఇప్పుడుఈ ఫోటోలు అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. అందుకే కదయ్యా మీకు మేం వీరాభిమానులం అని ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

పవన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలా ఉంటాడు.మొన్నటికి మొన్న మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చింది మంగళగిరిలోని తన ఇంట్లోనే. ఒక్కసారి ఆ ఇంటిని గమనిస్తే చాలా సాధారణంగా ఉంది. నులకమంచం మీద కూర్చుని ఇంటర్వ్యూ. వెనుక యాంబియన్స్ లో గొడ్లచావిడి కన్పిస్తుంది. ఆవు దూడ అక్కడే మేస్తున్నాయి. సహజసిద్ధమైన పల్లెటూరి వాతావరణాన్ని పవన్ ఎప్పుడూ ఇష్టపడతాడు. అందుకే కార్లు బంగళాల కంటే ఇలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
Please Read Disclaimer