పుల్వామా ఉగ్రదాడి తో లాభ పడింది ఎవరు … బీజేపీ కి రాహుల్ ప్రశ్న !

0

పుల్వామా ఎటాక్ ..గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లో ఉగ్రమూకలు సైన్యంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికీ ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులకు సలాం కొడుతూ ప్రతి ఒక్కరూ నివాళ్లు అర్పిస్తున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ కీనేక నేత రాహుల్ ట్విటర్ వేదికగా.. మరోసారి బీజేపీ సంచలన ఆరోపణలు చేసారు. పుల్వామా ఉగ్రదాడి లో మరణించిన 40 మంది అమర జవాన్ల కు నివాళు అర్పించిన తరువాత బీజేపీ ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలు అడిగారు.

1. ఈ దాడితో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది? 2. ఈ ఉగ్రదాడి పై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది. 3. దాడికి కారణమైన భద్రతా లోపాలకు బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’ అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఈ దాడిని సాకుగా చూపి భద్రత జాతీయవాదం పేరిట బీజేపీ గత లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా ఇటీవల ఉగ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడిన కశ్మీర్ పోలీసు అధికారి దవీందర్ సింగ్కు కూడా పుల్వామా దాడి తో సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యం లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వివాదానికి తెరతీసే అవకాశం కనిపిస్తోంది…
Please Read Disclaimer