చైనాకు చెక్.. ఇక భారత్ లోనే సెక్స్ టాయ్స్ తయారీ

0

సెక్స్ టాయ్స్.. మన జననాంగాలను పోలి ఉండే ఈ టాయ్స్ బొమ్మలు ఇన్నాళ్లు విదేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కొన్ని ఆన్ లైన్ సంస్థల ద్వారా భారత్ లోనూ అమ్మేవారు. శృంగార వాంఛను ఈ సెక్స్ టాయ్స్ ద్వారా తీర్చుకునేవారు. భారత్ లో ఇప్పటిదాకా ఇలాంటి టాయ్స్ తయారీ ఉత్పత్తి లేదు. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత భారత ప్రభుత్వం స్వదేశీ నినాదం ఇవ్వడంతో ఇదే సెక్స్ టాయ్స్ వ్యాపారంలో 2012 నుంచి ఉన్న ‘ఐయామ్ బేషరామ్. కామ్’ వ్యవస్థాపకుడు రాజ్ ఆర్మానీ తాజాగా భారతీయుల కోసం సంప్రదాయ బద్ధమైన సెక్స్ టాయ్స్ తయారీకి ముందుకొచ్చాడు.

భారతీయుల కోసం మగ ఆడ సెక్స్ టాయ్స్ లేదా బొమ్మలు మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజ్ ఆర్మానీ తెలిపారు. భారతీయ ప్రాధామ్యాలు అభిరుచుల ప్రకారం వీటిని తయారు చేస్తామని డిసెంబర్ వరకు వీటిని భారతీయ మార్కెట్లోకి మేడిన్ ఇండియావి తీసుకొస్తామని తెలిపారు.

ప్రస్తుతం భారత్ లో విక్రయించే సెక్స్ టాయ్స్ అన్నీ దిగుమతి చేసుకున్నవే. చైనా నుంచే మన దేశానికి వస్తున్నాయి. ప్రపంచంలోనే సెక్స్ బొమ్మల తయారీలో 70శాతం చైనాలోనే తయారవుతున్నాయి. భారత్ లో ఈ పరిశ్రమ విలువ 2000 కోట్లు. రోజురోజుకు పెరుగుతున్న వీటి వినియోగం కారణంగా భారత్ లో కొత్తగా తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి రాజ్ ఆర్మానీ ముందుకొస్తున్నాడు.
Please Read Disclaimer