సహజీవనంపై మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు

0

గడిచిన పదేళ్లలో దేశంలో సహజీవనం ఎంతగా ఎక్కువైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్.. నవల్స్ నుంచి కళ్ల ఎదుటకు రావటమే కాదు.. లివింగ్ రిలేషన్ షిప్ తో ఉన్న వాణిజ్య ప్రకటనలు.. సీరియల్స్ కూడా వచ్చేసిన పరిస్థితి. ఇక.. వెబ్ సిరీస్ లలో అయితే.. ఈ జోరు మరింత పెరిగింది. వీటి ప్రభావం కావొచ్చు.. పేరెంట్స్ నియంత్రణలో వచ్చిన మార్పులతో సహజీవనం చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఒకప్పుడు ఎక్కడో ఒకటి అరాగా కనిపించే స్థాయి నుంచి ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో సహజీవనం అంతకంతకూ పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాల్ని జారీ చేసింది. సహజీవనాల్ని ప్రభుత్వం ప్రోత్సహించకూడదన్న వ్యాఖ్యతో పాటు.. వాటి బారినపడకుండా మహిళల్ని కాపాడేందుకు వీలుగా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ప్రకాష్ తాతియా. ఈ మేరకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించారు.

సహజీవనం ఉచ్చులో పడకుండా కాపాడేలా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని.. అత్యవసరంగా ఆ విధానాన్ని నిషేధించాలని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర.. కేంద్రప్రభుత్వాలు స్పందించాలన్నారు. మహిళలు ఉంపుడుగత్తెల్లా సహజీవనం చేయకుండా పవిత్రమైన పెళ్లి చేసుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయాలన్నారు.

వివాహం అనేది పవిత్ర సంబంధం అని అన్ని మతాల్లో చెప్పారని.. అందుకే మహిళలు సహజీవనం మానేసి.. పెళ్లి చేసుకోవాలని ఆయన కోరారు. మరి.. ఆయన వ్యాఖ్యలపై నేటి తరం యూత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer