బాలుడి మృతి కలచి వేసిందన్న సూపర్ స్టార్

0

తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన సుర్జిత్ విల్సన్ అనే రెండు సంవత్సరాల బాలుడు బోరు బావిలో పడ్డ విషయం తెల్సిందే. ఆ బాలుడిని కాపాడేందుకు దాదాపు 80 గంటల పాటు ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. బాలుడు బోర్ వెల్ లో ఉన్న సమయంలో తమిళ స్టార్స్ చాలా మంది ఆపరేషన్ సక్సెస్ అయ్యి బాలుడు బయటకు రావాలని కోరుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆ బాలుడి గురించి వార్తలు ప్రసారం అయ్యాయి. దేశ ప్రధాని వరకు కూడా ఈ విషయం వెళ్లింది.

ఎంతగా ప్రయత్నించినా కూడా బాలుడిని కాపాడలేక పోయారు. బాలుడు మృతి చెందినట్లుగా ప్రకటించిన వెంటనే అంతా కూడా తీవ్ర దు:ఖంలో మునిగి పోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ బాలుడి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ బాలుడి మృతి నన్ను చాలా కలచి వేసింది. బాలుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్నాడు. బాలుడి కుటుంబ సభ్యులకు తన సంతాపంను తెలియజేశాడు.

ఈ సందర్బంగా ఇంకా పలువురు సినీ తారలు కూడా బాలుడి గురించి సోషల్ మీడియాలో స్పందించారు. సమంత.. వివేక్ ఒబేరాయ్.. అట్లీ.. జీవీ ప్రకాష్ ఇంకా ప్రముఖులు పలువురు బాలుడి గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించిన వారిలో ఉన్నారు.
Please Read Disclaimer