ఆపత్కాలంలో రష్యా టూర్: డైలామాలో రాజ్ నాథ్ సింగ్

0

ప్రస్తుతం వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ముఖ్యంగా విదేశీ పర్యటనలు నిషేధం ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో రష్యాలో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆహ్వానం అందింది. ఈ పరిస్థితిలో రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్తారో లేదో అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే వైరస్ వ్యాప్తి అన్ని దేశాల్లో తీవ్రంగా ఉంది. భారత్లో కూడా అదే పరిస్థితి. ఈ సమయంలో పర్యటన చేస్తే ఎలా ఉంటుందోని డైలామాలో పడ్డారని సమాచారం.

ప్రపంచ దేశాలు అన్ని రకాల వేడుకలను రద్దు చేసుకున్నాయి. దాదాపు 90 రోజులుగా ప్రపంచంలోని సుమారు 120 దేశాలు వైరస్ కట్టడి చర్యలు అమలుచేస్తున్నాయి. ఈ సమయంలోనే రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జూన్ 24న సైనిక కవాతు ఉంది. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తింపుగా రష్యా ప్రతియేటా ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. ఈ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ 2020తో 75వ వార్షికోత్సవం. ఈ ఉత్సవం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో రష్యా తప్పక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొదట ఈ కార్యక్రమం వాయిదా పడుతుందని అందరూ భావించారు. ఈ మేరకు అన్ని దేశాల మంత్రులకు ఆహ్వానం పంపింది. ఈ క్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా ఆహ్వానం అందింది.

ఈ మేరకు రాజ్నాథ్ సింగ్కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయ్గు ఆహ్వానం పంపారు. ఆ మేరకు రాజ్నాథ్ సింగ్ రష్యాకు పయనం కానున్నారు. ఈ విక్టరీ డే పరేడ్ వేడుకల్లో భారత్ తరఫున త్రివిధ దళాలకు చెందిన 75 మంది మిలిటరీ బృందం హాజరుకానుంది. ఈ బృందానికి భారత సిక్కు ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన మేజర్ ర్యాంక్ ఆఫీసర్ నాయకత్వం వహించనున్నారని సమాచారం. రష్యాతో పాటు మిత్ర దేశాలు కనబరిచిన సాహసం త్యాగాలను స్మరిస్తూ విక్టరీ డే పరేడ్ను రష్యా నిర్వహిస్తోంది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో సిక్కు రెజిమెంట్ నాలుగు యుద్ధ అవార్డులను సాధించడంతో వారినే మాస్కోకు పంపనున్నారు. అయితే రష్యాలో కూడా వైరస్ తీవ్రంగా ఉంది. ఆ దేశంలో మొత్తం కేసులు 576952 ఉన్నాయి. దీంతో ఈ వేడుకలకు హాజరయ్యే అంశంలో సంధిగ్దత ఏర్పడింది.
Please Read Disclaimer