సైబరాబాద్ పోలీస్ కి పిల్లనిస్తానన్న వర్మ!

0

ఆర్జీవీ కామెడీ గురించి.. కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆయన తిక్కరేగితే అంతే సంగతి. టైమ్ చూసి చెలరేగిపోవడంలో తన తర్వాతనే. మీడియా అటెన్షన్ పూర్తిగా తనవైపు తిప్పేసుకుని ఉచిత ప్రచారం చేయించుకునే ఎత్తుగడల్లోనూ అతడు తనకు తానే సాటి. ఈ ఎపిసోడ్స్ అన్నిటినీ నిన్నటికి నిన్న అందరి కళ్లకు ప్రత్యక్షమయ్యేలా చేశాడు గురుడు. ఇస్మార్ట్ శంకర్ బీర్ పార్టీ మొదలు.. ట్రాఫిక్ లో ట్రిపుల్ రైడ్.. అటు పై సైబరాబాద్ పోలీస్ కి చలాన్ కట్టి వాళ్లను అల్లుడిగా ప్రకటించడం వగైరా వగైరా ఎపిసోడ్స్ అన్నీ రక్తి కట్టించేవే.

ఈ సొసైటీని సైకలాజికల్ గా ఫిలాసఫికల్ గా ఆడుకోవాలన్నది ఆర్జీవీ తత్వం. ఇది ప్రతి సందర్భంలో ప్రూవ్ అవుతూనే ఉంది. అయితే కొన్నిసార్లు అతడి పిచ్చి చేష్టలు పీక్స్ కి చేరుకోవడమే జనాలకు అర్థం కాదు. అతడు వినోదం పంచేందుకే ఇదంతా చేస్తున్నా.. దాని వెనక పబ్లిసిటీ అనే ఎజెండాని ఎవరూ ఎప్పుడూ మర్చిపోరు. అదంతా సరే కానీ.. ఆర్జీవీకి పిచ్చి ప్రకోపించి రకరకాలుగా ట్వీట్లు చేస్తూ ఇస్మార్ట్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు.

నిన్న ట్రిపుల్ రైడ్ ఎపిసోడ్ తర్వాత 1300 చలాన్ కట్టిన వర్మ సైబరాబాద్ పోలీసులనుద్ధేశించి చేసిన కామెంట్ వైరల్ గా మారింది. ఇంతకీ అతడేమని ట్వీట్ చేశారంటే .. “సైబరాబాద్ పోలీస్ గారూ.. ఐ లవ్ యూ… మీరు చేసిన ఈ ఫెంటాస్టిక్ వర్క్ కి మిమ్మల్ని 39 రోజుల పాటు నాన్ స్టాప్ గా ముద్దాడతాను“ అని వ్యాఖ్యానించారు. నాకు రెండో కూతురే ఉండి ఉంటే మిమ్మల్ని అల్లుడిని చేసుకుంటానని ప్రార్థిస్తున్నా! అంటూ వ్యంగ్యం గానూ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆర్జీవీ మార్క్ కామెడీలు బాగానే ఉన్నా.. ఆర్జీవీకి రెండో కూతురు పుట్టేదెపుడో తేలాల్సి ఉంది.
Please Read Disclaimer