మరో పిటిషన్ తో కోర్టుకు ఎక్కిన రవిప్రకాష్!

0

ఒకవైపు ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. అందుకు సంబంధించిన తీర్పు రిజర్వ్ లో ఉంది. రవి ప్రకాష్ ను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఆయన అరెస్టు విషయంలో మాత్రం కోర్టులో వాదనలు సాగాయి. కోర్టు ఆ అంశంలో తీర్పును ఇవ్వలేదు.

టీవీ నైన్ యాజమాన్యం రవి ప్రకాష్ పై పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఆ యాజమాన్యంపై రవి ప్రకాష్ బోలెడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అయితే కేసులు పెట్టే వరకూ ఆయన వారిపై ఎలాంటి ఆరోపణలే చేయలేదు!

మొత్తానికి రవి ప్రకాష్ అరెస్టు అవుతాడా లేదా అనేది ఇంకా తేలని అంశంగానే ఉంది. ఆ సంగతలా ఉంటే.. తనపై పెట్టిన కేసులన్నింటినీ కొట్టేయాలని ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనపై కేసులు నమోదు కాగానే రవి ప్రకాష్ ఆ విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే అప్పుడు ఆయనకు కోర్టు ఊరటను ఇవ్వలేదు. అయినా ఇప్పుడు మరోసారి రవి ప్రకాష్ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయినవి అక్రమ కేసులు అని.. సైబరాబాద్ బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లలో నమోదు అయిన ఆ కేసులను కొట్టి వేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందించనుందో!
Please Read Disclaimer