3 నెలలు EMI లు కట్టాల్సిన పనిలేదు!

0


కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల బ్యాంకుల నెల వాయిదాలపై ఆర్బీఐ మారిటోయం విధించింది. దీనికిందకు టర్మ్ లోన్స్ తో పాటు అన్ని రకాల నెల వాయిదాలు ఉన్నాయి. ఈ నిబంధన అటు కమర్షియల్ – రీజనల్ – రూరల్ – నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది.

దీని ప్రకారం … మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు. ఇలా మూడు నెలల పాటు మీరు వాయిదా కట్ అవ్వని డబ్బుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆ మొత్తం వినియోగ దారులకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మూడు నెలల తరువాత మళ్లీ ఈఎంఐలు చెల్లించాలి. గృహ – వాహన – పర్సనల్ లోన్స్ తీసుకునే వినియోగ దారులకు ఆర్బీఐ ప్రకటన వరమనే చెప్పాలి. నెల ప్రారంభంలోనే వేతనం పడగానే ఈఎంఐ రూపేణా బ్యాంకులు వారి వేతనాన్ని వాయిదాల్లో ఆటోమేటిగ్గా జమచేసేసుకుంటాయి. ఈ ఊరటతో వినియోగదారులకు మూడు నెలల పాటు ఈఎంఐ డబ్బు సేవ్ అవుతుందనే చెప్పాలి.

ఈఎంఐలు కట్టని పక్షంలో సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఇవాళ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు వ్యాపారులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరంగా – పటిష్టంగా ఉందని ద్రవ్యోల్బణం సహా ఇతర అంశాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. మున్ముందు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకి సహకరిద్దాం అని అయన పిలుపునిచ్చారు. అలాగే 150 మంది ఆర్బీఐ ఉద్యోగులు క్వారం టైన్ లో ఉన్నారని చెప్పారు. 

బ్యాంకుల్లో డబ్బులు భద్రం…

తాజా చర్యలతో రూ.3.74 లక్షల కోట్లు మార్కెట్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లోనూ ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజలు నగదు ఉపసంహరణ(విత్‌డ్రా) విషయంలో ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన విధాన సమీక్ష తర్వాత మార్కెట్లోకి దాదాపు రూ.2.7లక్షల కోట్లు విడుదల చేశామని తెలిపారు.  

పరిస్థితి కొనసాగితే మరింత ప్రమాదం..  

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శక్తికాంతదాస్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి, దాని తీవ్రత ఎంతకాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనాతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిని ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో మునుపెన్నడూ లేనంత అస్థిరత నెలకొందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదలను ఆదుకోవడానికి ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మరుసటి రోజే ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. వచ్చే మూడు నెలల పాటు  ఉద్దీపన పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వెల్లడించారు.  

ఆర్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు…

> టర్మ్‌లోన్ల ఈఎంఐలపై 3 నెలల మారటోరియం

> రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం ఇది 4.4 శాతానికి చేరింది.

> రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. దీంతో ప్రస్తత రివర్స్‌ రెపో రేటు 4శాతానికి తగ్గింది. 

> బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తిని(సీఆర్‌ఆర్‌) 100 బేసిస్‌ పాయింట్ల తగ్గింపుతో సీఆర్‌ఆర్‌ 3శాతానికి చేరింది. దీంతో రూ.1.37 లక్షల కోట్లు మార్కెట్లోకి విడుదల చేసే వెసులుబాటు కలుగుతుంది. 

> లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ(ఎల్‌ఏఎఫ్‌) 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. ప్రస్తుత ఎల్‌ఏఎఫ్‌ 4శాతానికి చేరిక.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-