5చోట్ల రీపోలింగ్‌ చంద్రగిరిపై ఈసీఐ అనూహ్య నిర్ణయం ఈ నెల 19న ఎన్నిక

0

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్కడ రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఎన్నికల అధికారులు భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా రీ పోలింగ్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఈసీఐ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
Please Read Disclaimer