రియల్ క్రైమ్: ఆస్తి కోసం కోడలు దారుణం

0

ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఒకరి తర్వాత ఒకరిని పకడ్బందీ ప్లాన్లతో హత్య చేసిన మాయలేడీ కేసును పోలీసులు ఛేధించారు. 14 ఏళ్ల వ్యవధిలో తన రెండో భర్త సాయంతో మహిళ ఈ హత్యలను చేసినట్టు తెలిసి పోలీసులే విస్తుపోయారు.

కేరళలోని కోచికోడ్ లో 2002 నుంచి 2016 వరకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల హత్య మిస్టరీని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పదంగా మరణించిన కుటుంబంలోని ఆరుగు వ్యక్తుల హత్యకు ఆ ఇంటి కోడలు సూత్రధారి అని తేల్చారు.

కేరళకు చెందిన జోలీ అనే ఓ ఇంటి కోడలు ఈ హత్యలను పకడ్బందీగా చేసింది. 2002లో జోలి అత్త అయిన రిటైర్డ్ టీచర్ అన్నమ్మ థామస్ అనే మహిళ కుప్పకూలి చనిపోయారు. ఆమెది సహజమరణంగా అందరూ భావించారు. ఆ తర్వాత అదే ఇంట్లో జోలి అత్త భర్త టామ్ థామస్ గుండె పోటుతో మరణించారు. 2011లో జోలి భర్త రాయ్ థామస్ కూడా ఇదే తరహాలో మరణించారు. ఇక 2014లో అత్త సోదరుడు మాథ్యూ కూడా ఇలాగే మరణించాడు. ఇక 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సా కూడా గుండెపోటుతో మరణించింది. ఆమె తల్లి సిల్లీ కూడా అసవులు బాసింది.

ఈ హత్యలన్నింటిపై అనుమానం రావడం కేరళలో కలకలం రేపింది. ఈ హత్యలను కోడలు జోలి చేసిందనే విమర్శలు వచ్చాయి. జోలి వారి కుటుంబ ఆస్తిని తన పేరున మార్పిడి చేసుకుంది. అయితే జోలి మామ టామ్ చిన్నకుమారుడు అమెరికాలో ఉండగా.. ఈ మరణాలపై అనుమానం వచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెనైడ్ సాయంతోనే జోలి ఈ ఘాతుకానికి పాల్పడిందని తేల్చారు.

ఇలా ఆస్తి కోసం సొంత అత్తా మామలు కట్టుకున్న భర్త వారి కుటుంబ సభ్యులందరినీ చంపిన కోడలు జోలి కేసును పోలీసులు అతికష్టం మీద తేల్చారు. జోలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.Please Read Disclaimer