Templates by BIGtheme NET
Home >> Telugu News >> నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?: రేవంత్ నిప్పులు

నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?: రేవంత్ నిప్పులు


పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు.దానికి నిన్న మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ విమర్శలకు మళ్లీ రేవంత్ రెడ్డి ఎన్ కౌంటర్ చేసేశాడు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘టీడీపీ’ అంటూ నేతలను టార్గెట్ చేసే రాజకీయం మాత్రం యమ రంజుగా సాగుతోంది.

తెలంగాణలో కనుమరుగైన టీడీపీని ఇక్కడి జనం ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ టీడీపీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో సహజంగానే టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోని అసమ్మతులు ఆ ముద్ర వేస్తున్నారు. నిన్న కేటీఆర్ ఈరోజు హరీష్ రావు సైతం ‘రేవంత్ రెడ్డి టీడీపీ’ అంటూ విమర్శించారు.

తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడు ఎలానో.. అలా తాను కాంగ్రెస్ కు అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరే ముందు టీడీపీ పదవులన్నింటికి రాజీనామా చేశానని.. అసెంబ్లీ జీతం పడే ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీకే వెళ్లలేదన్నారు.

టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు మంత్రులుగా కూడా ఉన్నారని అన్నారు. పార్టీ వల్లనే తనకు ఈ పదవి వచ్చింది కాబట్టి తన రాజీనామాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చానని రేవంత్ అన్నారు.

ఇక మంత్రి హరీష్ రావు కామెంట్లపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబే తెలంగాణ పీసీసీ పదవి ఇప్పించారని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. హరీష్ బ్రతుకే కాంగ్రెస్ అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును మంత్రిని చేసిందని కాంగ్రెస్ అన్నారు. హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది సోనియా వైఎస్ఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. గతి లేక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కాళ్లు పట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు టీడీపీయే దిక్కు అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు.