కేసీఆర్ కు ఊహించని రీతిలో షాకిచ్చిన ఫైర్ బ్రాండ్

0

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు చాలామంది ఉన్నా.. ఇటీవల కాలంలో ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నారే కానీ.. ప్రతిపక్ష నేతలుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాల్ని తెర మీదకు తీసుకురాలేకపోతున్నారు. ఇలాంటి వేళ.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆ లోటును తీర్చే ప్రయత్నం చేశారని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మైహోం రామేశ్వర్ రావుకు సంబంధించిన ఒక అంశాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారీ ఫైర్ బ్రాండ్. రాయదుర్గంలో వందల కోట్లు విలువైన భూమిని హైహోమ్ కు కేటాయించారని పిటిషన్ లో పేర్కొన్నారు. రూల్స్ కు విరుద్ధంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారంటూ రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఈ పిటిషన్ ను విచారణకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అదే సమయంలో ఈ అంశానికి సంబంధించి రామేశ్వర్ రావుకు.. తెలంగాణ ప్రభుత్వంతో పాటు డీఎల్ ఎఫ్ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేవంత్ పిటిషన్ మైహోం రామేశ్వర్ రావుకు అయినప్పటికీ దీని ఎఫెక్ట్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే ఉంటుందంటున్నారు. ఈ పిటిషన్ పైన విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తన తాజా పిటిషన్ తో సీఎం సారుకు.. ఆయనకు సన్నిహితుడైన మిత్రుడికి ఒకేసారి షాకిచ్చినట్లైందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer