ఏపీలో సామూహిక వ్యాప్తి 8 శాతమే !

0

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రాన్ని కొంత ఈ వార్త కొంత ఊరట అని చెప్పవచ్చు. ఎక్కువ టెస్టులు నిర్వహించడం ద్వారా వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మంచి ఫలితాలని ఇస్తుంది. కమ్యూనిటీ స్ప్రెడ్ (సామూహిక వ్యాప్తి) జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇండియా డాట్ ఇన్ పిక్సెల్స్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమ్యూనిటీ స్ప్రెడ్ కు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికను విడుదల చేసింది.

ఆ నివేదికలో ఏపీలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్కు 8 శాతం మాత్రమే అవకాశముంది అని వెల్లడించింది. అలాగే 7000 పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రాష్ట్రాల్లో నమోదైన కేసులు కోలుకున్న వారు క్వారంటైన్ లో ఉన్న వారి వివరాల ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ అవకాశాలకు ఒక ఫార్ములా రూపొందించారు.

దీని ప్రకారం 100 శాతం దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ తప్పనిసరి. ఇలా చూస్తే ఢిల్లీ 143 శాతంతో మొదటి స్థానంలో ఉండగా 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.గుజరాత్ 45 శాతం మహారాష్ట్ర 65 శాతం రాజస్తాన్ పశ్చిమబెంగాల్ 24 శాతం తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే ఏపీలో భారీగా వైరస్ టెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షలు 7 లక్షలకు చేరుకోనున్నాయి. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 693548కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9372కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 111కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4826కి చేరింది.
Please Read Disclaimer