ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం!

0

Robert Trump Donald Trump younger brother passes away

Robert Trump Donald Trump younger brother passes away

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ (71) న్యూయార్క్ ఆసుపత్రిలో కన్నుమూసారు.

రాబర్ట్ ట్రంప్ కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మాన్ హట్టన్ లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

ట్రంప్ తన సోదరుడు మృతిపై భావోద్వేగంతో స్పందించాడు. రాబర్ట్ తనకు తమ్ముడే కాదని.. చాలా మంచి స్నేహితుడని చెప్పాడు. తన సోదరుడిని చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. కాగా సోదరుడి అంత్యక్రియలకు ట్రంప్ హాజరు కాబోతున్నారు. కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.

ఇక ట్రంప్ కూతురు ఇవాంక కూడా బాబాయ్ మృతికి నివాళులర్పించారు.