సెక్స్ కిల్లర్: 93మందితో శృంగారం.. హత్య..

0

అమెరికా చరిత్రలోనే ఎక్కువ మంది అమ్మాయిలను రేప్ చేసి అతికిరాతకంగా చంపిన సీరియల్ సెక్స్ కిల్లర్ ఉదంతం వెలుగు చూసింది. ఇప్పటివరకు అమెరికాలో లారీ డ్రైవర్ గేరి రిడ్జ్ వే 1980-90 దశకంలో 69 హత్యలు చేయగా.. ఇప్పుడు తాజాగా ఆ రికార్డును ఒకప్పుడు బాక్సర్ గా కొనసాగిన సామ్యూల్ లిటిల్ అనే కామపిశాచి కిల్లర్ బద్దలు కొట్టాడు.

ఇల్లు వాకిలి లేని బాక్సర్ సామ్యూల్ చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వ్యభిచారిణులు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు జీవితంలో దెబ్బతిన్న ఆడవాళ్లందరితో శృంగారం చేసి వారిని హతమార్చడం పనిగా పెట్టుకున్నాడు.

అమెరికాలోని 19 రాష్ట్రాల్లో దాదాపు 93మంది అమ్మాయిలతో శృంగారం చేసి అనంతరం హత్య చేసిన వైనం వెలుగుచూసింది. ఆడవాళ్లను నగ్నంగా చేసి వారితో శృంగారం చేసి అనంతరం హత్య చేసి చెత్త కుండీలు కాల్వలో అలాగే నగ్నంగా పడేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. కొత్త వారితో సెక్స్ చేస్తే పాత వారు అడ్డుతగులుతారనే ఈ వరుస హత్యలు చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఏ అమ్మాయిని తాను రేప్ చేయలేదని.. అందరూ ఇష్టపూర్వకంగానే తనతో గడిపారని సామ్యూల్ చెప్పుకొచ్చాడు.

పోలీసుల విచారణలో తాను చేసిన 93 మహిళల హత్యల్లో 50 మంది హత్యలను ఒప్పుకున్నాడు. వారి బొమ్మలు కూడా గీసి చూపించాడు. ప్రస్తుతం 79 ఏళ్లు ఉన్న సామ్యూల్ కిరాతకాలతో మిస్సింగ్ అయిన మహిళల కేసులను పోలీసులు ఛేధిస్తున్నారు. 1980 దశకంలో చేసిన మూడు హత్యల్లో సామ్యూల్ ప్రస్తుతం 2014 నుంచి యవజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.
Please Read Disclaimer