సౌదీ రాజు సంచలన నిర్ణయం ..వారికి భారీ ఊరట – ఎందుకంటే ?

0

వైరస్ విజృంభిస్తున్న సమయం లో సౌదీ రాజు సల్మాన్ ఓ ఊరట నిచ్చే ప్రకటన చేశారు. లాక్ డౌన్ సమయం కంటే ముందు సౌదీ కి వచ్చి అక్కడే చిక్కుకు పోయిన వారికి భారీ ఊరట ను కల్పించారు. ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్ వీసా గడువు ముగిసి ఉంటే దాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఇందుకు ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయమని స్పష్టం చేశారు. ఇక సౌదీ కి వెలుపల ఉన్న వారికి కూడా మూడు నెలల పాటు ఈ పొడిగింపు వర్తిస్తుందని తెలిపారు.

సౌదీకి వచ్చేందుకు ప్రవాసులు వీసాలు పొందినవారికి అప్పటికే సౌదీలో వీసాతో ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ఆ వీసా గడువు ముగిసింది. దీంతో వారు సౌదీని వదిలి వెళ్లాల్సి ఉంది. కొందరు తాము ఏ పనిమీద అయితే సౌదీకి చేరుకున్నారో లాక్ డౌన్ కారణంగా అది నిలిచిపోయింది. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారని రాజు సల్మాన్ దృష్టికి రావడంతో అలాంటి వీసా దారులకు మూడు నెలల వీసా పొడిగిస్తూ రాజు ప్రకటన చేశారు.

ఇక సౌదీ రాజు సల్మాన్ తాజాగా ప్రవాసుల మేలు కోసం తీసుకున్న నిర్ణయంతో లాక్ డౌన్ సమయంలో సౌదీలో ఉన్నవారే కాకుండా సౌదీకి వెలుపల ఉన్న వారు కూడా లబ్ధి పొందనున్నారు. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో చాలామంది వీసాలు ఉండి కూడా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. అంతేకాదు సౌదీలో ప్రవేశించడంపై తాత్కాలికంగా నిషేధం విధించడంతో మరింత ఇక్కట్లు పడ్డారు.