వ్యాక్సిన్ వచ్చే లోపు 70శాతం మందికి కరోనా!

0

మానవ జనాభాలో 60-70శాతం మంది కరోనా వైరస్ బారిన పడుతారని.. వ్యాక్సిన్ రావడానికి మరో 18-24 నెలల సమయం పట్టవచ్చని.. అప్పటివరకు కరోనాను ఎదుర్కొక తప్పదని జాన్ హ్యాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిషాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్పితే ప్రస్తుతానికి కరోనాను ఏమీ చేయలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. జైపూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (IIHMR) నిర్వహించిన వెబ్నార్లో ఆయన ప్రసంగించారు.

వచ్చే రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదని.. అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుందని ప్రొఫెసర్ బిషాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనంతో డబ్బు తక్కువగా ఉంటుందని.. ఏ పథకాలు పనులు చేయలేరని.. అందుబాబులో మానవ వనరులు ఉండకపోవడంతో భారత దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని బిషాయ్ విశ్లేషించారు.

చిరు వ్యాపారాలను దేశ పరిశ్రమలు ఇతర రంగాలను తిరిగి తక్షణం ప్రారంభించాలని.. బ్యాంకుల నుంచి వారికి రుణాలు ఇప్పించాలని.. తద్వారా ఉపాధి సృష్టించబడుతుందని బిషాయ్ సూచించారు.

దేశానికి వలస కార్మికులే బలమని.. వారంతా తరలిపోతే పనులు ఆగి భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని బిషాయ్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్తో 92.5శాతం మంది కార్మికులు నెలరోజుల పని కోల్పోయారని.. తక్షణం ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని సూచించారు. ఇక రోజువారీ వేతనాలు సంపాదించే వారిలో చాలా మంది ఉపాధిని కరోనా దూరం చేసిందని.. వలస కార్మికులు ఉపాధి కూలీలను ఆదుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలని సూచించారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home