ఫాంహౌస్ లో సెక్స్ రాకెట్.. సంబంధం లేదన్న బీజేపీ నేత?

0

కరోనా అంటుతుందన్న కనీస భయం లేకుండా ప్రస్తుతం వ్యభిచార దందాలు కొనసాగుతుండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. అందరూ వైరస్ తో ఇంట్లో ఉంటే కొందరు రసిక రాయుళ్లు మాత్రం శృంగారానికి అర్రులు చాస్తుండడం విశేషం.

ఉత్తరప్రదేశ్ లో ఓ భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. ఆగ్రా సమీపంలోని ఓ ఫాంహౌజ్ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ దందా కొనసాగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలతోపాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే సదురు వ్యభిచార దందా నడుస్తున్న ఫాంహౌస్ ఒక బీజేపీ నేతదిగా పోలీసులు గుర్తించారు. దీంతో సర్కార్ కంగారుపడింది.

అయితే ఈ సెక్స్ రాకెట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని సదురు బీజేపీ నేత చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం సచిన్ విష్ణు గోయల్ అనే వ్యక్తులకు లీజుకు ఇచ్చానని వివరించాడు. అక్కడ ఏం చేస్తున్నారన్నది తనకు తెలియదని.. అరెస్ట్ అయిన వారితో సంబంధం లేదని బీజేపీ నేత క్లారిటీ ఇచ్చాడు. కాగా ఫాంహజ్ నుంచే అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని.. ఇక్కడి నుంచే దందా జరుగుతోందని పోలీసులు తేల్చారు.