కాలేజ్ హాస్టల్ పక్కనే కాల్‌గర్ల్స్.. గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు

0

గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రద్దీగా ఉండే కళాశాల హాస్టల్ పరిసరాలను ఎంచుకుని కొద్దికాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఇద్దరు విటులు కాగా, నలుగురు నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళగిరి మండలం చినకాకాని పరిధిలో ఓ భవనంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడూ విద్యార్థుల తాకిడితో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే అనుమానం రాదన్న ఉద్దేశంతో యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు.
Please Read Disclaimer