షాకింగ్: వెలుగులోకి దిశ నిందితుల దారుణాలు

0

దిశ నిందితుల కేసు దర్యాప్తు లో ఎన్నో చెప్పలేని దారుణాలు వెలుగుచూసినట్లు తెలిసింది. వీరు దిశనే కాదు.. దాదాపు మరో 9మంది మహిళలపై ఇలానే హత్యాచారాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందట.. ఎన్ కౌంటర్ కు ముందు దిశ నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో 9మందిని అత్యాచారం చేసి హత్య చేసి కాల్చేసినట్లు అంగీకరించినట్టు తెలుస్తోంది.

ప్రధాన సూత్రధారి ఆరిఫ్ అలీ 6 హత్యలు చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్ నగర్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలోనే చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఆయా ప్రాంతాల్లో 15మంది మహిళల మిస్సింగ్ కేసులు ఉండడంతో అది వీరి పనే అని అనుమానిస్తున్నారు. మహిళలను కిడ్నాప్ చేయడం.. అత్యాచారం చేయడం.. హత్య చేసి మృతదేహాలను పూర్తిగా దహనం చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దిశను కూడా అదే ప్లాన్ తో అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలిందట.. కానీ దిశ నుంచి వెళ్లిన ఫోన్ కాల్ తో వీరు దొరికిపోయారు.

కాగా వీరు చేసిన 9 హత్యలపై పోలీసులు విచారించగా.. ఆయా ప్రాంతాల్లో 15 మహిళల మిస్సింగ్ కేసులున్నాయి. మహిళల మృతదేహాలను పూర్తిగా కాలిపోవడంతో వీరు ఇప్పటి వరకు చిక్కలేదు. డీఎన్ఏ పరీక్షలకు కూడా దొరకనంతగా బాడీలను బూడిద చేయడంతో నిందితులు పోలీసులకు చిక్కలేదు.

దిశ కేసు నిందితుల డీఎన్ఏను హత్యకు గురైన 9మంది మృతుల డీఎన్ఏలతో సరిపోలుస్తున్నారు. ఆ కేసులను ఛేదించే పనిలో ఉన్నారు.
Please Read Disclaimer