బ్రెస్ట్ తీయించుకుని ఛాంపియన్ అయింది!

0

ఆట కోసం ప్లేయర్లు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. కానీ తాజాగా వింబుల్డన్ లో సెరెనా విలియమ్స్ లాంటి ఆల్ టైం గ్రేట్ ను ఓడించి టైటిల్ అందుకున్న రొమేనియా అమ్మాయి సిమోనా హలెప్ చేసిన సాహసం – త్యాగం మాత్రం సాధారణమైంది కాదు. ఆమె సర్జరీ ద్వారా పెద్ద సైజులో ఉన్న తన ఎద భాగాల్నే తగ్గించుకోవడం విశేషం. టీనేజీలోనే ఆమెకు బ్రెస్ట్ పెద్ద సైజుకు చేరుకున్నాయి. దీంతో టెన్నిస్ ఆడటం చాలా కష్టమైంది. ఆ బరువు అలాగే ఉంటే ఆటలో ముందుకు సాగడం కష్టమని ఆమె అర్థం చేసుకుంది. వైద్య నిపుణుల్ని సంప్రదించి సర్జరీ ద్వారా వాటి భారం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. 2009లో తనకు కేవలం 17 ఏళ్ల వయసుండగా హలెప్ సర్జరీకి వెళ్లడం విశేషం.

శస్త్ర చికిత్స తర్వాత హలెప్ బ్రెస్ట్ సైజ్ సగానికి సగం తగ్గింది. ఐతే ఈ బరువులు తగ్గినంత మాత్రాన హలెప్ ఆట మారిపోతుందా అని ఎద్దేవా చేసిన వాళ్లూ లేకపోలేదు. హలెప్ వెంటనే అద్భుతాలేమీ చేసేయలేదు. ఒంట్లో ఒక భాగంలో అనూహ్యమైన మార్పు వచ్చినపుడు ఆ ప్రభావం కొంత కాలం ఉంటుంది. హలెప్ ఆటలో మార్పు కొంచెం లేటుగానే మొదలైంది. నెమ్మదిగా ఆమె ఆటను మెరుగుపరుచుకుంది. గ్రాండ్స్లామ్స్లో ప్రదర్శన మారుస్తూ వెళ్లింది. ప్రపంచ నంబర్వన్ అయింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తొలి గ్రాండ్ స్లామ్ ను ఖాతాలో వేసుకుంది. నిలకడ కొనసాగిస్తూ ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ లకే గ్రాండ్ స్లామ్ అనదగ్గ వింబుల్డన్ లో సెరెనా లాంటి దిగ్గజాన్ని ఓడించి టైటిల్ సాధించింది.
Please Read Disclaimer