రైలు బోగీ ద్వారం వద్ద 10 అడుగుల త్రాచుపాము:వీడియో!

0

ఉత్తరాఖండ్‌ కాత్గొదమ్‌ రైల్వేస్టేషన్‌లో 10 అడుగుల తాచు పాము ఒకటి రైలు బోగీ దిగువ భాగంలో కనిపించింది. రైలు ఆగిన సమయంలో రైల్వే సిబ్బంది దీన్ని గుర్తించారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌ అటవీశాఖకు చెందిన డాక్టర్‌ పీఎం దాకేటే తన ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. పామును గుర్తించే సమయంలో సరిగ్గా రైలు బోగీ ద్వారం వద్ద కింది భాగంలో ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా దాన్ని తొలగించినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
Please Read Disclaimer