సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కూరగాయల అమ్మకం.. కారణమిదే

0

కరోనా మన జీవితాలను తలకిందులు చేసింది. లక్షలు సంపాదించేవారిని రోడ్డునపడేసింది. ఉద్యోగ ఉపాధి దూరం చేసింది. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పరిశ్రమలు షాపులు ఆఫీసులు మూతబడడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఇలా ఉద్యోగం కోల్పోయిన వారిలో హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన శారద కూడా ఒకరు. కరోనా ఎఫెక్ట్ కంపెనీ ఈమెను తీసివేసింది. అయితే ఉద్యోగం కోల్పోతే కృంగిపోకుండా ఆమె ధైర్యంగా నిలబడింది. అందరిలో బాధపడతూ కూర్చోకుండా శ్రీనగర్ కాలనీలో కూరగాయల వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.

జాబ్ పోయిందని బాధపడడం లేదని.. తప్పకుండా మళ్లీ ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉందని శారద అంటోంది. కూరగాయలు అమ్ముతున్నందుకు సిగ్గుపడడం లేదని.. కాళ్లు చేతులు బాగున్నాయని కష్టపడడం తప్పుకాదని పేర్కొంది. తన తండ్రి చేస్తున్న కూరగాయాల వ్యాపారాన్ని తాను నిర్వహిస్తున్నాని ధైర్యంగా చెబుతోంది.

ఇలా ఉద్యోగం పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకునే వాళ్లకు ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం పోయినా కూరగాయలు అమ్ముతున్న శారద పట్టుదల స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేద.