శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కన్య రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కన్య రాశి ఫ‌లాలు

కన్య రాశి ఉత్తర- 2,3,4 పాదాలు హస్త- 1,2,3,4 పాదాలు చిత్త -1,2 పాదాలు
ఆదాయం 2, వ్యయం – 11; రాజపూజ్యం – 04, అవమానం – 07

కన్యారాశి వారికి దశమంలో ఉన్న రాహువు, చతుర్ధంలో ఉన్న గురుకేతువులు, పంచమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం నుంచి ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహాయోగం అనుకూలమవుతాయి. శుభకార్య సంబంధ విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది.

వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. అరటినారవత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు.

అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలన చిత్ర అంశాలను, రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. సివిల్‌, క్రిమినల్‌ కేసులలో తీర్పులు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహల గురించి, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-