శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కర్కాటక రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కర్కాటక రాశి ఫ‌లాలు

కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు అశ్లేష 1, 2,3,4 పాదాలు
ఆదాయం 11, వ్యయం – 5; రాజపూజ్యం – 05, అవమానం – 04

ఈ రాశివారికి వ్యయంలో ఉన్న రాహువు, షష్టమంలో ఉన్న కేతువు, సప్తమంలో ఉన్న శని, షష్టమంలో ఉన్న గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తాయి. వీరికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. సాంకేతిక, వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం అభిమానంగా మారి సహాయపడతారు. ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు. కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలవారి కృషికి తగిన గుర్తింపు, గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు, గ్రహా బాధలు తొలగిపోతాయి (తలస్నానం చేయరాదు). స్పెక్యులేషన్స్‌, సేల్స్‌ సంవత్సర ప్రారంభంలో ఎక్కువ ఆసక్తి కలుగజేస్తాయి. మనస్సు ఎంత వద్దనుకున్నా ఆ మార్గాల వైపు లాగుతుంది. వ్యాపారంలో రొటేషన్‌, లాభాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజులు పొడిగించే వంటి విషయాలు లాభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యం అవుతుంది. జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది.
Please Read Disclaimer