శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కుంభ రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం కుంభ రాశి ఫ‌లాలు

కుంభ రాశి ధనిష్ఠ-3,4 పాదాలు, శతభిషం-1,2,3,4 పాదాలు
పూర్వాభాద్ర-1,2,3 పాదాలు

ఆదాయం 8, వ్యయం – 11; రాజపూజ్యం – 06, అవమానం – 03

కుంభరాశి వారికి ఏలిననాటి శని ప్రారంభమైంది. పంచమంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న గురుకేతువులు వ్యయంలో ఉన్న శని, గురుశుక్ర మౌఢ్యమిలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్దాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు.

అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయవర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్ధం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమ:శివాయ వత్తులతో అష్టమూలికా తైలం కలిపి దీపారాధన చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు.

మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటివాళ్ళు అధికంగా లాభం పొందుతారు. ఈ విషయం మిమ్మల్ని నియమ నిబంధనలకు బాధించినా కొంతకాలం తరువాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-