శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం మీన రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం మీన రాశి ఫ‌లాలు

మీన రాశి పూర్వాభాద్ర-4వ పాదం, ఉత్తరాభాద్ర- నాలుగుపాదాలు, రేవతి- నాలుగు పాదాలు
ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2

ఈరాశి వారికి చతుర్ధంలో ఉన్న రాహువు, దశమంలో ఉన్న గురుకేతువులు, ఏకాదశంలో ఉన్న శని, గురుశుక్ర మౌఢ్యమిలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి.ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభం పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమాయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి.

రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది. సహోదర వర్గం ప్రేమ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించి లాభపడతారు. భవిష్యత్తు కార్యక్రమాల గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది. విందులు, వినోదాలు, శుభాకార్యాలలో అవమానాలను ఎదుర్కొంటారు. స్థిరాస్థి కొనుగోలు విషయంలో జాప్యం తప్పదు. సంస్థాపరంగా తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు కారణమవుతాయి. గతంలో వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. మొండిబాకీలు వసూలవుతాయి.

ఆధికారులు, ప్రముఖులతో ఆచితూచి మాట్లాడాలి. రుద్రజడను వినియోగించాలి. సహోదర వర్గం వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-