శ్రీ‌ శార్వరి నామ సంవత్సర మేషరాశి ఫలాలు 2020-21

0

శ్రీ‌ శార్వరి నామ సంవత్సర మేషరాశిఫలాలు

మేషరాశి
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1

నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.

తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు, దశమంలో శని, తొమ్మిదింట ఉన్న గురువు, రవి చంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక, ఆరోగ్యపరిస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. గృహ సంబంధ విషయాలు, వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్‌ల వల్ల లాభపడతారు. ఆధునిక, సాంకేతిక పరికరాలు కొనుగోలు విషయంలో పరిమితి సాటిస్తారు.

సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యాలయాలకు సంబంధించిన బ్రాంచిలను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడి విషయంలో వెనుదిరగరు. కొత్తవారిని నియమిస్తారు. పూజలు, అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించడం ఉత్తమం. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వ్యాపారపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, దొంగ స్వామీజీల పట్ల మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. మీడియాకు కూడా వివరాలు అందజేస్తారు. ఎంతో రహస్యంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్థాపం కలిగిస్తుంది. దీర్హకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ దస్త్రాలపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-