శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం సింహ రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం సింహ రాశి ఫ‌లాలు

కర్కాటక రాశి మఖ-1,2,3,4 పాదాలు పుబ్బ-1, 2,3,4 పాదాలు
ఉత్తర – 1వ పాదం
ఆదాయం 14, వ్యయం – 2; రాజపూజ్యం – 02, అవమానం – 07

ఈ రాశివారికి ఏకాదశంలో ఉన్న రాహువు, పంచమంలో ఉన్న కేతువు, షష్టమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషం. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు.

పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే సాగుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండడం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

విద్య వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. సివిల్‌ సర్వీస్‌లు, ఇతర పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. వ్యక్తిగత, ఆఫీసు రహస్యాలను శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయట పెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. అన్ని రకాల వాయిద్యకారులకు మంచి రోజులు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-