శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం వృశ్చిక రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం వృశ్చిక రాశి ఫ‌లాలు

వృశ్చిక రాశి విశాఖ-4వపాదం, అనూరాధ- నాలుగుపాదాలు, జ్యేష్ట-నాలుగుపాదాలు
ఆదాయం 5, వ్యయం – 5; రాజపూజ్యం – 03, అవమానం – 03

వృశ్చికరాశి వారికి అష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న కేతువు, మూడింట శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధ విషయాలు సానుకూలపడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. వేరేవిధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు.

ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. . మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్‌, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. అరటినారవత్తులతో దీపారాధన చేయండి. విద్యాసంస్థలకు పేరుప్రఖ్యాతులు లభిస్తాయి.

నిరుద్యోగులు, విద్యావంతుల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. పదవీప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్ధపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, ట్రావెల్స్‌, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-