శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం వృషభ రాశి ఫ‌లాలు

0

శ్రీ శార్వరి నామ సంవ‌త్స‌రం వృషభ రాశి ఫ‌లాలు

వృషభ రాశి (కృత్తిక-2,3,4 పాదాలు, రోహిణి 1,2,3,4, మృగశిర 1, 2 పాదాలు)

ఆదాయం 14, వ్యయం – 11; రాజపూజ్యం – 06, అవమానం – 01

ఈ రాశివారికి ద్వితీయంలో ఉన్న రాహువు, ఎనిమిదింట కేతువు, తొమ్మిదింట ఉన్న శని, ఎనిమిదింట ఉన్న గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గతంలో జీవితభాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుంచి కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. లౌక్యంగా ప్రతిఘటించి, వాస్తవాలు నిరూపించి మీ న మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఐశ్వర్యనాగిని ఉపయోగించాలి.

మహిళల వల్ల ప్రయోజనం పొందుతారు. ద్వితీయార్ధంలో వృత్తి, ఉద్యోగాలలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. కుటుంబం, బంధువులతో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సహోదర వర్గానికి అండగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకు సహాయం చేస్తారు. బాధ్యత అంతా మీపై వేసుకుంటారు. శుభకార్యాలకు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలు విఫలంమవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలపాలు చేసుకోవద్దు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-