శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు 2020-21

0

శ్రీ‌ శార్వరి నామ సంవత్సర రాశిఫలాలు 2020-21

ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ.. దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇది చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు. కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె, మాసం, రుతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతీయుల కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.12 రాశుల సంక్షిప్త సంవత్సర ఫలితాలను వీక్షిస్తే…

మేషం :

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1

నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.

తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు, దశమంలో శని, తొమ్మిదింట ఉన్న గురువు, రవి చంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి మేషం…

వృషభం : 

ఆదాయం 14, వ్యయం – 11; రాజపూజ్యం – 06, అవమానం – 01

నక్షత్రాలు- పాదాలు: కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.

ఈ రాశివారికి ద్వితీయంలో ఉన్న రాహువు, ఎనిమిదింట కేతువు, తొమ్మిదింట ఉన్న శని, ఎనిమిదింట ఉన్న గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు  పూర్తి వివరాల కోసం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి వృషభం….

మిథునం: 

ఆదాయం 2, వ్యయం – 11; రాజపూజ్యం – 02, అవమానం – 04

నక్షత్రాలు- పాదాలు: మృగశిర 3, 4, పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు.

ఈ రాశి వారికి లగ్నంలో ఉన్న రాహువు.. సప్తమంలో ఉన్న గురుకేతువులు, అష్టమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు పూర్తి వివరాల కోసం  ఇక్క‌డ క్లిక్ చేయండి మిథునం…

కర్కాటకం: 

ఆదాయం 11, వ్యయం – 5; రాజపూజ్యం – 05, అవమానం – 04

నక్షత్రాలు- పాదాలు: పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు

ఈ రాశివారికి వ్యయంలో ఉన్న రాహువు, షష్టమంలో ఉన్న కేతువు, సప్తమంలో ఉన్న శని, షష్టమంలో ఉన్న గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు 12 మాసాల ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కర్కాటకం…

సింహరాశి: 

ఆదాయం 14, వ్యయం – 2; రాజపూజ్యం – 02, అవమానం – 07

నక్షత్రాలు- పాదాలు: మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం

ఈ రాశివారికి ఏకాదశంలో ఉన్న రాహువు, పంచమంలో ఉన్న కేతువు, షష్టమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి సింహరాశి..

కన్యారాశి: 

ఆదాయం 2, వ్యయం – 11; రాజపూజ్యం – 04, అవమానం – 07

నక్షత్రాలు- పాదాలు: ఉత్తర 2, 3 , 4 పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త 1,2 పాదాలు

కన్యారాశి వారికి దశమంలో ఉన్న రాహువు, చతుర్ధంలో ఉన్న గురుకేతువులు, పంచమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు  పూర్తి ఫలితా విశ్లేషణ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కన్యారాశి…..

తులారాశి: 

ఆదాయం 14, వ్యయం – 11; రాజపూజ్యం – 07, అవమానం – 07

నక్షత్రాలు- పాదాలు: చిత్త 3,4 పాదాలు, స్వాతి పాదాలు నాలుగు పాదాలు, విశాఖ 3 పాదాలు.

తులారాశి వారికి భాగ్యంలో ఉన్న రాహువు, మూడింట ఉన్న గురుకేతువులు, నాలుగింట ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి తులారాశి….

వృశ్చికరాశి: 

ఆదాయం 5, వ్యయం – 5; రాజపూజ్యం – 03, అవమానం – 03

నక్షత్రాలు- పాదాలు: విశాఖ 4 పాదం, అనూరాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు

వృశ్చికరాశి వారికి అష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న కేతువు, మూడింట శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి వృశ్చికరాశి….

ధనస్సురాశి: 

ఆదాయం 8, వ్యయం – 11; రాజపూజ్యం – 06, అవమానం – 03

నక్షత్రాలు- పాదాలు: మూల నాలుగు పాదాలు, పూర్వాషాడ నాలుగు పాదాలు, ఉత్తరాషాడ 1 పాదం

ఈ వారికి జన్మరాశిలో ఉన్న గురుకేతువులు, సప్తమంలో ఉన్న రాహువు, ద్వితీయస్థానంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి ధనస్సు…

మకరరాశి: 

ఆదాయం 11, వ్యయం – 05; రాజపూజ్యం – 02, అవమానం – 06

నక్షత్రాలు- పాదాలు: ఉత్తరాషాడ 2, 3, 5 పాదాలు, శ్రవణ నాలుగు పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం

మకరరాశి వారికి షష్టమంలో ఉన్న రాహువు, వ్యయంలో ఉన్న గురుకేతువులు, జన్మరాశిలో సంచరించు శని, రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌఢ్యమిలు పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి  మకరరాశి..

కుంభరాశి: 

ఆదాయం 8, వ్యయం – 11; రాజపూజ్యం – 06, అవమానం – 03

నక్షత్రాలు- పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నాలుగు పాదాలు, పూర్వాషాడ 1, 2, 3పాదాలు

కుంభరాశి వారికి ఏలిననాటి శని ప్రారంభమైంది. పంచమంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న గురుకేతువులు వ్యయంలో ఉన్న శని, గురుశుక్ర మౌఢ్యమిలు

పూర్తి 12 మాసాల ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కుంభరాశి….

మీనరాశి: 

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2

నక్షత్రాలు- పాదాలు: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు.

ఈరాశి వారికి చతుర్ధంలో ఉన్న రాహువు, దశమంలో ఉన్న గురుకేతువులు, ఏకాదశంలో ఉన్న శని, గురుశుక్ర మౌఢ్యమిలు

పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి మీనరాశి….