ఎస్‌బీఐ డెబిట్ కార్డులు పనిచేయవు.. ఈలోగా మార్చేసుకోండి.. లేదంటే…

0

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఝలకిచ్చింది. ఎస్‌బీఐ మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది. ఇప్పటికీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. వీలైనంత త్వరగా డెబిట్ కార్డులను మార్చుకోవాలని పేర్కొంది.

కచ్చితంగా మార్చుకోవాల్సిందే

‘రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. మేం ఇప్పటికే మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత కార్డులతో రీప్లేస్ చేశాం. మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో ఇంకా మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఈ కార్డులను డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్ చేస్తాం. పనిచేయవు. ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోండి’ అని ఎస్‌బీఐ కస్టమర్లకు తెలిపింది.

డిసెంబర్ 31 తర్వాత

మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి ఇప్పుడే అప్లై చేసుకోవాలంటూ ఎస్‌బీఐ ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత ఎస్‌బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తిచేయాలని పేర్కొంది. దీంతో మోసాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని తెలిపింది.

ఉచితంగానే పొందొచ్చు

స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును పొందొచ్చు. ‘కస్టమర్లు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కొత్త డెబిట్ కార్డును సులభంగా పొందొచ్చు. ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తిచేసుకోవచ్చని వివరించింది.

అడ్రస్ అప్‌డేట్ మరిచిపోవద్దు

కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఎస్‌బీఐ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కరెంట్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త ఈఎంవీ చిప్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్న అడ్రస్‌కే వెళ్లిపోతుంది. అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్‌డేట్ చేసుకోండి.

చార్జీల మోత

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన ఎస్‌బీఐ కార్డు తాజాగా తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. కస్టమర్లపై చార్జీల బాదుడు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారిపై నేరుగాపై ప్రభావం పడనుంది.

కొత్త ఏడాది నుంచి బాదుడు షురూ

ఎస్‌బీఐ కార్డు ఇప్పటికే చెక్‌బుక్ పేమెంట్స్‌పై చార్జీలను వసూలు చేస్తోంది. చెబ్‌బుక్ రూపంలో రూ.2,000లోపు బిల్లు మొత్తం చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ కార్డు అన్ని రకాల చెక్ పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. రూ.100తోపాటు ఇతర చార్జీలను వసూలు చేయాలని భావిస్తోంది. అంటే అన్ని చెక్ పేమెంట్స్‌పై దాదాపు రూ.118 బాదుడు తప్పదు. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
Please Read Disclaimer