కరోనా మరణ మృదంగం.. 17వేలకు మరణాలు

0

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడా దేశంలో తగ్గుముఖం పట్టినా ప్రపంచానికి సోకి అతలాకుతలం చేస్తోంది. 190 దేశాల్లో వైరస్ బారిన పడ్డ పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. రోజురోజుకు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

కరోనా వైరస్ మరణాల సంఖ్య 17వేలకు చేరువ అవుతోంది. సోమవారం నాటికి కరోనా మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 16591కి చేరింది. ఈ రాత్రి వరకు 17వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది. 1.02 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు. 12వేల మంది చావు బతుకుల మధ్య ఉన్నారు.

కరోనా వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీలో కరోనా మరణ మృందంగం వాయిస్తోంది. అక్కడ జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇటలీ దేశంలో మంగళవారం నాటికి 6000 మరణాలు దాటాయి. కరోనా పుట్టిన చైనాలో కేవలం 3277మంది చావగా.. ఇటలీలో రెట్టింపు మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 17000 కన్నా ఎక్కువగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఒక్కరోజే 602 మరణాలు సంభవించాయి. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 63000కు చేరాయి..

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి వెలువడ్డ సమాచారం ప్రకారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 350536 కేసులు నమోదయ్యాయి. యూరప్ ఉత్తర అమెరికా మొత్తం కరోనా విస్తరించింది.

*భారత దేశంలో 515మందికి కరోనా..
భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య మంగళవారానికి ఏకంగా 515కు చేరింది. మహారాష్ట్రలో 89మంది తెలంగాణలో 36మందికి కరోనా సోకింది. సోమ మంగళవారాల్లోనే తెలంగాణలో ఆరు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ విజయవాడ తూర్పుగోదావరి ప్రకాశంలో ఈ కేసులు నమోదయ్యాయి.

ఇక దక్షిణ కొరియా సింగపూర్ ఇప్పటివరకు లాక్ డౌన్ లేకుండా వ్యాప్తిని నియంత్రించడానికి వైద్యసేవలు ప్రారంభించాయి. అక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చేసింది. కొత్తగా సౌత్ కొరియాలో 64 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8961కు చేరుకున్నాయి.

అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఒకే రోజులో 100 మంది మరణించారు. ఇప్పటివరకు 520 మరణాలు సంభవించాయి. న్యూయార్క్ లోనే 157 మంది మరణించారు.

ఇటలీ స్పెయిన్ దేశాల్లో రోగులు ఎక్కువై.. ఆస్పత్రులు ఖాళీ లేక ఇంటిలోనే చికిత్స చేస్తున్న పరిస్థితి నెలకొంది. చైనాలో 39 కొత్త కేసులు నమోదయ్యాయి. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే.. 9 మరణాలు సంభవించాయి.

బ్రిటన్ దేశం కరోనా వైరస్ పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరికరాలను పంపిణీ చేయడానికి సైన్యాన్ని వినియోగిస్తోంది. బ్రిటన్ లో 5748 కేసులు.. 282 మంది మరణించారు.

ఇక కెనెడా దేశంలో ఇంట్లో నుంచే పనిచేయాలని.. బయటకు రావద్దని.. అందరూ ఇల్లకు వెళ్లాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కోరారు. కెనడాలో ఇప్పటివరకు 1432 కేసులు.. 20 మరణాలు చోటుచేసుకున్నాయి.

భారత్ లో కరోనా కేసులు పెరగడంతో మొత్తం దేశవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొందని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మొత్తం దేశమంతా బంద్ పడనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-