మహిళలపై లైంగిక వేధింపులు.. సుప్రీం సంచలన తీర్పు

0

సుప్రీం కోర్టు మరో చారిత్రక తీర్పును వెలువరించింది. పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఓ సీనియర్ అధికారిపై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని బదిలీ చేస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం సంస్కరణ చట్టం 2013 ప్రకారం వారి హక్కులను హరించడమేనని సుప్రీం అభిప్రాయపడింది. రాజ్యాంగం కల్పిస్తున్న ఆర్టికల్ 14 15 ప్రకారం ప్రాథమిక హక్కులను నిరాకరించినట్లేనని సుప్రీం స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని తనను ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఆమె అవినీతి ఆరోపణలు చేసిందని జబల్ పూర్ కు బదిలీ చేశారు. దీనిపై మహిళా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బదిలీ చేయడం ఏంటని ధర్మాసనం మండిపడింది. ప్రతీకార చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఇది మహిళ గౌరవానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. బదిలీ ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇండోర్ లోనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని పరిహారం కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-