చేతబడి పోవాలని చిన్నారిని చంపేశాడు!

0

భారత ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి ల్యాండర్లను పంపుతున్న కాలమిదీ… అయినా ఈ కాలంలోనూ ఇంకా చేతబడులు మంత్రాలు తంత్రాలు ఉన్నాయని నమ్మి అమాయకుల ప్రాణాలు తీసేవారు ఉండడం దారుణమైన విషయం..

తాజాగా ముంబైలో చేతబడి నెపంతో ఓ చిన్నారిని ఏడో అంతస్తు నుంచి పడేసి చంపిన వ్యక్తి ఉదంతంలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. తనకు చుట్టుముట్టిన కష్టాలకు ఎవరో చేతబడి చేయడమే కారణమని.. ఆ సమస్యలు పోవాలంటే కవలలను బలి ఇవ్వాలని ఎవరో మహిళ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన ముంబైకి చెందిన అనిల్ చుగాని అనే వ్యక్తి తన స్నేహితుడి కవలలను చంపడానికి ప్లాన్ చేశారు. ఒక పాపను ఏడో అంతస్తు నుంచి కిందపడేసి చంపాడు. ఇంకోపాపను నానమ్మ పట్టుకోవడంతో ప్రాణాలు దక్కించుకుంది.

ముంబైలోని కొలాబా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిని ఏడో అంతస్తు నుంచి అనిల్ చుగాని అనే వ్యక్తి కింద పడేసి చంపిన వ్యవహారంలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. మొరాకో దేశంలోని బట్టల షాపులో పనిచేస్తున్న అనిల్ రెండు నెలల క్రితం ముంబైకి వచ్చేశాడు. అప్పటి నుంచి దరిద్రం వెంటాడింది. దీనికి ఎవరో చేతబడి చేశారని ఇద్దరు కవలలను బలి ఇస్తే నీ సమస్యలు పోతాయని అనిల్ కు చెప్పారు. గడిచిన మే నుంచి కవల పిల్లల కోసం వెతుకుతున్నాడు. చివరకు తన స్నేహితుడు ప్రేమ్ కు ఇద్దరు కవలలు అని తెలుసుకొని వారిని ఇంటికి ఆహ్వానించాడు. భోజనం చేశాక ఒక పాపను తీసుకెళ్లి ఏడో అంతస్తు నుంచి కిందపడేశాడు. మరో పాపను వాల్ల నానమ్మ ఎత్తుకొని ఉండడంతో హత్య సాధ్యపడలేదు.

మూడేళ్ల కవల చిన్నారిని చంపిన అనిల్ చుగానిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి డైరీలో చేతబడి కారణంగా కవలలను చంపాలని రాసి ఉండడం చూసి షాక్ తిన్నారు. అలా చంపితే తన సమస్యలు తీరుతాయని.. అంతీంద్రయ శక్తులు వస్తాయనే అలా చేసినట్టు అనిల్ పోలీసులకు చెప్పడం నివ్వెరపరిచింది. చంపినందుకు తన బాధ లేదని మరీ లొంగిపోవడం సంచలనంగా మారింది.
Please Read Disclaimer