గన్ నోట్లో పెట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే చిందులు

0

బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ప్రజాప్రతినిధుల ఆగడాలు రోజుకొకటి చొప్పున బయటపడుతూనే ఉంటున్నాయి. మహారాష్ట్రలో ఓ బీజేపీ ఎమ్మెల్యే అధికారులను కొట్టడం వివాదాస్పదమైంది. ఇక ఉత్తరాఖండ్ లోనూ ఓ జర్నలిస్టును బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

అయితే బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించినా ఆ ఎమ్మెల్యేకు బుద్దిరాలేదు. తాజాగా మద్యం తాగుతూ తుపాకులు పట్టుకొని తన మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు చిందులు వేసిన ఆ బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే వీడియో వైరల్ గా మారింది. ఇటీవలే కాలుకు ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే కోలుకున్నాడు. ఆ ఊపులోనే మద్దతు దారులతో పార్టీ చేసుకున్నట్టు తెలిసింది.ఇందులోనే మద్యం తాగుతూ గన్ చేతిలో పెట్టుకొని నోట్లో పెట్టుకొని బాలీవుడ్ పాటలకు చిందులేశాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దృష్టిసారించారు. సదురు ఎమ్మెల్యే చేతిలోని గన్ లైసెన్స్ ఉన్నదా లేదా.? ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Please Read Disclaimer