సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

అంచనా తప్పని స్వామి..జగన్ పై మండిపడిన పెద్దాయన

0

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మత మార్పిళ్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా“ అని గతంలో ప్రకటించిన స్వామి పరిపూర్ణనంద తాజాగా ఈ మేరకు రంగంలోకి దిగారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. 23 ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం ఒక్కడి వల్ల కాదన్న ఆయన.. మరికొంత మందికి ఈ కుట్రలో భాగం ఉందని ఆరోపించారు. ఇవాళ విగ్రహాలే కదా అని వదిలేస్తే..రేపు హిందువుల ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలు సృష్టిస్తారని అన్నారు.

మతిస్థిమితం లేని వ్యక్తికి..దేవతల విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేయాలని అనిపించిందా?అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కనబడలేదా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.తాము సెక్యులర్ అని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. కానీ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదని పరిపూర్ణానంద ఆరోపించారు. హిందువుల సమస్య వైసీపీకి – టీడీపీకి పట్టదా? అని ప్రశ్నించారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన ముఠాను అరెస్ట్ చేయాలని పార్టీలు – నేతలు డిమాండ్ చేయాలన్నారు.

విగ్రహాల ధ్వంసం కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని అనుమనించాల్సిన పరిస్థితి తలెత్తిందన్న ఆయన.. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రజలు హర్షించరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 23 ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ఓ కుట్రపూరిత చర్య అని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు చేసే విచారణపై మాకు నమ్మకం లేదని అందుకే….హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక ద్వారా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Please Read Disclaimer