పరిపూర్ణనంద ఆగ్రహం.. చర్యలు తీసుకోకుంటే ఆమరణదీక్షేనట

0

తెలంగాణ బీజేపీలో ఒక వెలుగు వెలగాలని తపించినప్పటికి.. ఆ పని చేయటంలో ఫెయిల్ అయ్యారు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి. గడిచిన కొంత కాలంలో ఆయన కామ్ గా ఉంటున్నారు. తన పని తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఆయన తాజాగా సంచలన ప్రకటన చేశారు.

ఇటీవల పిఠాపురంలోని దేవతా విగ్రహాల్ని ధ్వంసం చేసిన ముఠాను అరెస్టు చేయాలని ఆయన అల్టిమేటం జారీ చేస్తున్నారు. దేవతా విగ్రహాల్ని ధ్వంసం చేసిన వారి ఇళ్లను జఫ్తు చేయాలని.. కొత్త విగ్రహాల్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను చెప్పినట్లుగా చర్యలు తీసుకోకుంటే మాత్రం ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విగ్రహాల్ని ధ్వంసం చేసింది మతి స్థిమితం చేసిన వ్యక్తి అన్న వాదనల్ని ఆయన కొట్టి పారేస్తున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తికి గుడిలో విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా? రోడ్డు మీద ఉన్న రాజకీయనేతల ఫ్లెక్సీలు కనిపించవా? దేవతా విగ్రహాల్ని మాత్రమే ధ్వంసం చేయాలన్న ఆలోచన వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. విగ్రహాల్ని ధ్వంసం చేసిన వారిని ఇప్పుడు వదిలేస్తే.. రాబోయే రోజుల్లో హిందువుల ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలు కూడా సృష్టిస్తారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ప్వామి వారి వార్నింగ్ మీద ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer