ఢిల్లీ లో ఓటేసిన హీరోయిన్.. రొటీన్ కు భిన్నంగా!

0

సాధారణంగా బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును ముంబైలో వినియోగించుకుంటూ ఉంటారు. మెజారిటీ హిందీ సినిమా నటీనటుల ఓట్లు ముంబైలోనే నమోదు అయి ఉంటాయి. పోలింగ్ రోజున వారంతా అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు అక్కడ ఓటు వేయడం వార్తల్లో నిలిచింది. తమ ఓటు హక్కును వినియోగించుకున్న సదరు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు.

ఇక రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న సినీ సెలబ్రిటీలు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆధారం అయిన ఇంక్ ను తమ వేలి మీద చూపుతూ సంబర పడ్డారు. అలా సినిమా వాళ్లు ఉత్సాహంగా ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది. శనివారం రోజున అక్కడ పోలింగ్ కొనసాగుతూ ఉంది. అక్కడ ఒక హీరోయిన్ ఓటు హక్కును వినియోగించుకుంది. తనెవరో కాదు తాప్సీ పన్ను. పలు తెలుగు సినిమాలతో పాటు దక్షిణాది సినిమాల్లో నటించి ఇప్పుడు హిందీలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న తాప్సీ తన కుటుంబ సమేతంగా ఢిల్లీలో ఓటు వేసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సాధారణంగా సినిమా వాళ్ల ఓట్లన్నీ ముంబైలో ఉంటాయి. అయితే తాప్సీ మాత్రం తన ఓటు హక్కును ఢిల్లీలో కలిగి ఉన్నట్టుంది. ఈమెదొక పంజాబీ ఫ్యామిలీ. కుటుంబం ఢిల్లీలో సెటిలైనట్టుంది. అందుకే.. ఓటు హక్కును అక్కడే పెట్టుకున్నట్టుంది. ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడని తాప్సీ.. ఓటు హక్కును అయితే వినియోగించుకుంది.
Please Read Disclaimer