మీ ఉప్పులో సైనేడ్.. డేంజర్ పొంచి ఉందా?

0

సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. నిత్యం వాడే ఉప్పులో ప్రమాదకరమైన సైనేడ్ ఉందన్న విషయం బయటకు వచ్చింది. నోటికి తగిలినంతనే ప్రాణాలు తీసే ప్రమాదకరమైన సైనేడ్ ఉప్పులో ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఉప్పులో ప్రాణాలు తీసే విషం ఎందుకు కలుస్తుందన్న విషయంపై అమెరికన్ వెస్ట్ అనలిటికల్ ల్యాబ్ నివేదిక ఒకటి బయటకు వచ్చి సంచలనంగా మారింది.

ఈ నివేదిక ప్రకారం ఉప్పులో పొటాషియం ఫెర్రోసైనేడ్ ఉందని.. అన్ని అయోడైజ్డ్ ఉప్పులో పేర్కొన్న ప్రమాణాలకు మించిన ఈ రసాయనాన్ని కలుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని వినియోగదారుల హక్కుల కార్యకర్త శివ శంకర్ గుప్తా కూడా ఆరోపిస్తున్నారు.

రసాయనం కలుపుతున్న ఉప్పు నుంచి వినియోగదారులను రక్షించటమే తన లక్ష్యమని చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా తినని ఉప్పును దేశ ప్రజలకు పలు కంపెనీలు అంటకడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఉప్పును బ్లీచ్ చేసేందుకు ప్రముఖ కంపెనీలన్ని పారిశ్రామిక వ్యర్థాల్లో వచ్చే అయోడిన్.. సైనేడ్ ను ఉపయోగిస్తున్నాయని ఇది చాలా ప్రమాదకరంగా పేర్కొన్నారు.

దీని కారణంగా కేన్సర్ తో పాటు హైబీపీ.. హైపర్ థెరాయిడిజం.. కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊబకాయం.. లైంగిక సామర్థ్యం తినటం లాంటి సమస్యలకు బ్రాండెడ్ ఉప్పే కారణంగా ఆయన చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణల్ని ప్రముఖ కంపెనీ టాటా ఖండించింది.

అయోడైజ్డ్ ఉప్పులో పొటాషియం ఫెర్రోసైనేడ్ కలపటం నిజమేనని.. భారత్ తో పాటు అమెరికా.. యూరప్.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లోనూ ఉప్పులో వీటిని అనుమతిస్తున్నట్లుగా టాటా వెల్లడించింది. రూల్స్ ప్రకారం కిలో ఉప్పులో 10 మిల్లీ గ్రాముల పొటాషియం ఫెర్రోసైనేడ్ ను కలపొచ్చని.. గరిష్ఠంగా 14 ఎంజీ కలిపినా ప్రమాదం ఉండదని పేర్కొంది. ఈ తాజా చర్చపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వటం మంచిది.
Please Read Disclaimer