ప్రియుడి కారణంగా బిడ్డను కన్న వివాహిత.. శిశువును మూటకట్టి బావిలో పడేసి

0

కన్నతల్లి అన్న పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించిందో మహిళ. భర్తతో విడిపోయి మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె ఇద్దరికీ పుట్టిన బిడ్డను బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా ఒడుగత్తూరులో వెలుగుచూసింది. ఒడుగత్తూరు సమీపం అసనాంబట్టు కల్లపారై పరిధికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతో రెండు సంవత్సరాల క్రితం వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మహిళ కల్లపారైలో ఒంటరిగా నివసిస్తూ ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అతడి కారణంగా గర్భం దాల్చిన ఆమె ఈ నెల 20వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రియుడి కారణంగా పుట్టిన బిడ్డ తనకు వద్దని భావించిన మహిళ శిశువును గోనెసంచిలో చుట్టి ఓ బావిలో పడేసింది. గురువారం ఉదయం బావిలో మూటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మూటను పైకి తీసి చూడగా నవజాత శిశువు మృతదేహం బయటపడింది.

గ్రామంలో ఐదు రోజుల క్రితం ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చిందని స్థానికులు చెప్పడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. మూటలో దొరికిన శిశువు ఆమెదేనని గుర్తించి నిలదీయగా.. ప్రియుడి కారణంగా పుట్టిన బిడ్డను పెంచడం ఇష్టంలేకే చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-