మకాం మార్చుతున్న చంద్రబాబు, కొత్త ఇల్లు ఖరారు!

0

సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమల్లోనే కాదు.. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల విషయంలో తనదైన శైలిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రజా వేదికను రాత్రికి రాత్రే కూల్చేయించిన జగన్.. అక్రమ కట్టడాలను ఏ మాత్రం సహించబోమనేలా సంకేతాలు పంపారు. దీంతో జగన్ తదుపరి టార్గెట్ ప్రజా వేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం అని తేలిపోయింది. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేస్తే ఆయనకే మర్యాదగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. తను విదేశాల నుంచి తిరిగొచ్చేలోపు పరిస్థితి పూరిగా మారిపోవడంతో.. చంద్రబాబు చేయడానికి ఏం లేకుండా పోయింది.

ఓవైపు తమ నేతలకు బీజేపీ కన్ను గీటడాలు, మరోవైపు జగన్ సర్కారు దూకుడు.. రెండు వైపులా దాడితో బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజావేదికను కళ్ల ముందే కూల్చేయడంతో.. ఇక తను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడమే మంచిదనే నిర్ణయానికి బాబు వచ్చేశారు. అందుకే విజయవాడ, గుంటూరు నగరాల్లో తను ఉండటం కోసం ఇంటిని వెతికారు.

బాబు ఉండటానికి కొత్త నివాసం దొరికిందని సమాచారం. విజయవాడలోని కామినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా భవనంలోనికి చంద్రబాబు మకాం మార్చుతున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయనకు ప్రభుత్వం నివాసాన్ని కేటాయించే వరకు బాబు అందులో ఉంటారట. ఈ విషయమై వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఇంకా స్పందించలేదు.
Please Read Disclaimer