విజయసాయి రెడ్డిపై దిమ్మతిరిగే ఆరోపణలు చేసిన టీడీపీ నేత..!

0

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా కూడా ఏపీ రాజకీయాలలో ఇంకా వేడి తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే మరింత రసవత్తరంగా కనిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారు విమర్శలు గుప్పించడం సర్వసాధారణం. అయితే ఏపీలో మాత్రం ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసారు బుద్ధా వెంకన్న. ఏంటి శకుని మామా ఏ ప్రశ్నకీ సమాధానం లేదు, సీబీఐ కోర్టు బెయిలు రద్దు చేసేలా ఉందని తెలిసి మాట పడిపోయిందా అంటూ పాపం పండే రోజు దగ్గరపడిందని వణుకు మొదలయ్యిందా అని ప్రశ్నించారు. రేపో మాపో తుగ్లక్ జగన్ పెద్దల కాళ్ల్లు పట్టడానికి ఢిల్లీ వెళ్తున్నాడని తెలిసింది, నువ్వింకా మొదలెట్టలేదా ప్రయత్నాలు అంటూ ఎద్దేవా చేసారు.