‘సీఎం జగన్‌ను జైలుకు పంపేందుకు ఏర్పాట్లు.. గెట్ రెడీ’

0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు జైలుకు వెళ్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంగళవారం బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో కౌంటర్లు వేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డి కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ముందు వారిని ఆపే మార్గం చూడాలని ఎద్దేవా చేశారు.

16 నెలలు జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డికి మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అని ప్రశ్నించారు. అంత వరకూ వచ్చాక తాము మాత్రం చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను, విజయసాయిని మళ్లీ జైలుకు పంపేదుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెడీ గా ఉండండంటూ షాకింగ్ ట్వీ్ట్లు చేశారు.

పాత తప్పులు, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నంలో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయి, ఆయన పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
Please Read Disclaimer